Nirmala sitharaman: చరిత్ర పుస్తకం రాయాలంటే ఎంతో కృషి చేయాలి 1 y ago
AP : ప్రపంచ చరిత్ర పుస్తకంలో గడిచిన విషయాలను రాయడం చాలా గొప్ప విషయమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చరిత్రలో మంచి, చెడు రెండూ ఉంటాయని, జరిగిన గతాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. చరిత్ర రాయడం చాలా కఠినమైన విషయమని, చరిత్ర రాసేవాళ్లు అన్ని విషయాలు రాయడం కుదరదన్నారు. అతిపెద్దదైన చరిత్రను క్లుప్తంగా రాయడం ముఖ్యమని, చరిత్ర అర్థమయ్యేలా తక్కువ పేజీల్లో రాయడమే గొప్ప విషయమన్నారు. చరిత్రకు సంబంధించి పుస్తకం రాయాలంటే ఎంతో కృషి చేయాలని, ఎన్నో విషయాలను ఆకలింపు చేసుకొని పొందుపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు.